Tuesday, May 6, 2025
- Advertisement -

అవును నిజమే..దూబేతో డీఐజీ అనంత్ దేవ్‌..!

- Advertisement -

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఐజీ అనంత్ దేవ్‌పై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో కాన్పుర్ పోలీస్ చీఫ్‌గా పనిచేసిన అనంత్ దేవ్‌కి, దూబేకి సంబంధాలున్నట్టు సిట్ బృందం గుర్తించడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జులై 2న కాన్పుర్‌లోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను వికాస్ ముఠా కాల్చిచంపింది. వికాస్ దూబేతో మరో పోలీస్ అధికారి వినయ్ తివారీకి సంబంధాలు ఉన్నాయంటూ కాల్పుల ఘటనలో మృతి చెందిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా రాసిన ఓ లేఖపై చర్యలు తీసుకోలేదని అనంత్ దేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

”అనంత్ దేవ్‌ను సస్పెండ్ చేశాం. సిట్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నాం.” అని హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్థీ పేర్కొన్నారు. జులై 10న వికాస్ దూబేను ఉజ్జయినీ నుంచి కాన్పుర్ తరలిస్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -