కళ్లముందే పులి ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపేసింది? అతను పరిస్థితి ఏంటంటే ..!

- Advertisement -

ముగ్గురు స్నేహితులు సరదాగా ఒకే బైక్​పై అడవిలోకి షికారుకు వెళ్లారు. అక్కడ పులులుంటాయని అటవీ అధికారులు హెచ్చరించినా వాళ్ల చెవికి ఎక్కలేదు. అడవిని చూద్దామన్న కుతూహలం వాళ్ల కొంప ముంచింది. ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పులి చంపేసింది. మూడో వాడు చెట్టెక్కి 8 గంటలపాటు టెన్షన్​ టెన్షన్​గా గడిపాడు. ఓ క్రైం స్టోరీలోనో, థ్రిల్లర్​ సినిమాలోనో జరిగిన ఘటన కాదిది. వాస్తవమే సంఘటన.

తన కళ్లముందే స్నేహితులను పులి చంపుతుంటే .. నిస్సహాయ స్థితిలో ఓ యవకుడు ఎనిమిది గంటల పాటు నిద్రలేకుండా చెట్టుమీద గడిపాడంటే.. అతడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిట్ ప్రాంతంలోని ఖర్నౌట్ నదీ పరివాహ ప్రాంతంలో అటవీ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో బతికి బయటకొచ్చిన కుర్రాడి పేరు వికాస్​. అతడు ఏమంటున్నాడంటే..

- Advertisement -

‘నా ఫ్రెండ్స్​ సోను, కాందైలాల్​తో అడవికి వెళ్లాలనుకున్నాం. అడవి లోపలికి వెళ్లి చూడాలన్నది మా కోరిక. అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాకు కుతూహలం ఉండేది.నా ఫ్రెండ్​ సోను బైక్​ నడుపుతున్నాడు. ఇక కాందైలాల్​ మధ్యలో కూర్చొన్నాడు. నేను వెనకాల కూర్చొన్నాను. కొందరు అటవీ అధికారులు అడవిలో భయంకరమైన పులులు ఉన్నాయని చెప్పారు. కానీ మేం వినలేదు.

అయితే మేం అడవి లోపలికి ఓ సన్నదారి గుండా వెళ్తున్నాం. కొంత దూరం వెళ్లగానే మాకు రెండు పులులు కనిపించాయి. వాటినుంచి తప్పించుకోవడానికి బైక్​ నడుపుతున్న సోను ఎంతో ప్రయత్నించాడు. కానీ పులులు బైక్​ను వెంబడించాయి. ముందుగా పులి నా ఫ్రెండ్ సోను మీద దాడి చేసింది. ఆ తర్వాత నేను, కాందలాల్​ చెట్టు ఎక్కాలని ట్రై చేశాం. నేను వేగంగా వెళ్లి చెట్టు ఎక్కాను. అప్పుడు సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. చీకటి కమ్ముకున్నది.

ఇక ఆ పులులు నా ఫ్రెండ్స్​ను తినేశాయి. నేను చెట్టుమీద నుంచి ఆ దృశ్యాలను చూశాను. నేను రాత్రంతా చెట్టుమీదే బిక్కు బిక్కు మంటూ గడిపాను.పులులు చెట్టేందుకు యత్నించాయి. కానీ కొద్దిసేపటికి అవి వెళ్లిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు వికాస్​.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -