- Advertisement -

వీడియో..ముంబై మెట్రోపై దివ్యాంగుడి ప్రశంసలు

- Advertisement -

ముంబైకి చెందిన హాస్యనటుడు (Comedian) కర్ణ్ షా, ముంబై మెట్రోలో తన ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేయడంతో అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీల్‌చైర్ వాడే వారికి మెట్రో ఎంతటి స్వేచ్ఛను, స్వతంత్రతను ఇస్తుందో ఆయన ఈ వీడియో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘rollyrollyshah’గా పేరుపొందిన కర్ణ్ షా, తాను ఎవరి సహాయం లేకుండానే మెట్రోలో ప్రయాణించి ఇంటికి చేరుకున్న దృశ్యాలను రికార్డ్ చేశారు.వీడియో ప్రారంభంలో ఒక పోలీస్ అధికారి ఆయన్ను లిఫ్ట్ వరకు తీసుకెళ్లడం చూడవచ్చు. మెట్రో సిబ్బందికి దివ్యాంగులకు సహాయం చేసేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఇది స్పష్టం చేస్తోంది.

వీల్‌చైర్‌లో ఉన్న వారికి అనుకూలమైన ఎత్తులో ఉన్న టికెట్ కౌంటర్ వద్ద ఆయన స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. లిఫ్ట్ నుండి ట్రైన్ ఎక్కే వరకు ప్రతి అడుగులోనూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ర్యాంపులు, విశాలమైన దారులు ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. ఆ వీడియోకు కర్ణ్ షా జోడించిన క్యాప్షన్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. చాలామందికి ఇది కేవలం మెట్రో ప్రయాణం కావచ్చు. కానీ నాకైతే ఇది స్వేచ్ఛలా అనిపించింది. ఎవరి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. ‘ఎవరైనా సహాయం చేస్తారా?’ అని అడగాల్సిన పని లేదు. కేవలం నేను, నా వీల్‌చైర్ మరియు నా స్వతంత్రత. మమ్మల్ని మనసులో ఉంచుకుని ఇంతటి గొప్ప సౌకర్యాలు కల్పించినందుకు ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు.

https://www.instagram.com/reels/DXb5F8RPhKg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -