Monday, May 20, 2024
- Advertisement -

దేశంలో దొంగ బాబాల జాబితా ఇదే..

- Advertisement -

భ‌క్తి ముసుగులో డేరా బాబా సాగించిన రాస‌లీలలు ఇన్నీ ఇన్నీ కావు. లెక్కు మించి నేరాలు, ఎంతోమంది శిష్యురాళ్ల జీవితాల‌ను నాశ‌నం చేసిన కామ‌పిశాచి గుర్మిత్ సింగ్ బాబ‌. అయితే డేరా బాబా కామకేళి గురించి ఇప్పుడు మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి.

ప్ర‌స్తుతం జైలు జీవితం గుడ‌పుతున్నాడు డేరా బాబు.డేరా బాబా ‘సెక్స్’కు వ్యసనంగా మారాడని వైద్యులు చెబుతున్నారు. జైల్లో ఆయన మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారట. జైల్లోకి వెళ్లినప్పటి నుంచి శృంగారానికి దూరంగా ఉండాల్సి రావడంతో బాబా ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండటం,  గోడలతో మాట్లాడుతుండటం, సరిగా భోజనం చేయకపోవడం.. ఇవన్నీ దాని ఎఫెక్టే అని అంటున్నారు.

ఏళ్లుగా కొనసాగిస్తున్న తన రాసలీలలకు ఒక్కసారిగా బ్రేక్ పడేసరికి డేరా బాబా.. మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారిగా దానికి దూరం కావాల్సి రావడంతోనే జైల్లో ఆయనెప్పుడూ మూడీగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆయనకు త్వరగా చికిత్స అందించకపోతే సమస్య మరింత పెరుగుతుందని సదరు వైద్యులు వెల్లడించడం గమనార్హం.

స్వప్రకటిత బాబాలుగా చలామణి అవుతూ దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న 14మంది బాబాల పేర్లతో అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ ఒక జాబితా తయారుచేసింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆసారాం బాపూ, రాధేమా, సచ్చిదానంద్‌ గిరి ఎలియాస్‌ సచిన్‌ దత్తా, గుర్మీత్‌ రాంరహీం సింగ్‌, ఇచ్చాధారి భీమానంద్‌, మల్ఖన్‌ సింగ్‌, నారాయణ్‌ సాయి, రాంపాల్‌, ఆచార్య ఖుష్‌మురి, స్వామి అసీమానంద్‌, బృహస్పతి గిరి, ఓం నమః శివాయ బాబా, నిర్మల్‌ బాబా, ఓం బాబా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -