Sunday, May 11, 2025
- Advertisement -

రేవ్ పార్టీ క‌ల‌క‌లం..అమ్మాయిల‌కు హెచ్ఐవి టెస్ట్‌…

- Advertisement -

హైదరాబాద్ శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫామ్‌హౌస్‌లు, రిస్టార్ట్స్ యాజమాన్యాల కక్కుర్తితో చెత్త పనులు దర్జాగా సాగిపోతున్నాయి. రిసార్ట్ య‌జ‌మానులు కూడా నిబంధ‌న‌లు ఉల్లంగించి రేవ్ పార్టీల‌కు అనుమతినిస్తున్నారు.

తాజాగా తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్స్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గురువారం రాత్రి రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న నలుగురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిలో ఏడుగురు డాక్టర్లను, నలుగురు అమ్మాయిలు పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే భారీగా మద్యం, కండోమ్ పాకెట్లతో పాటు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడానికి వాడే మెడికల్ కిట్లు కూడా లభ్యమయ్యాయి. రేవ్‌పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -