Tuesday, May 6, 2025
- Advertisement -

కుక్కలకి కూడా ఓకే పండగ

- Advertisement -

ప్రతీ కుక్కకీ ఒక రోజు వస్తుంది అనేది సామెత, కుక్కలా కోసం ఒక రోజు ని పూర్తిగా కేటాయించిన దేశం కూడా ఉంది అంటే ఆశ్చర్యం వెయ్యక తప్పదు. అది కూడా మన పక్కనే ఉన్న నేపాల్ దేశం అంటే ఆశ్చర్యం వెయ్యక మానదు. ప్రతీ సంవత్సరం నేపాల్ లో తిహార్ పండగ సందర్భంగా నేపాల్ వాసులు పెంపుడు కుక్కలని పూజించే పని పెట్టుకుంటారు.

ఆ రోజు వాటికి ప్రత్యేకంగా ఆహార పదార్ధాలు కూడా వండి పెడతారు యజమానులు. ఋగ్వేదం లో ఉన్న అంశాలని పరిగణ లోకి తీసుకుని వారు ఈ పనులు చెయ్యడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంద్రుడు తన గోవుల్ని కనుక్కోవడం కోసం సమారా అనే కుక్క సహాయం తీసుకున్నాడు అని ఋగ్వేదం చెబుతోంది, దాన్ని అంశంగా వీరు పరిగణిస్తారు అంతే కాకుండా కుక్క యముడికి దూత కూడా అని వారు నమ్ముతారు. దానికోసం కుక్కలని గౌరవించాలి అనేది వారి కోరిక. ఒక పక్క చైనా లో కుక్కలని దారుణంగా చంపి వాటిని తిని వేడుకలు చేసుకుంటూ ఉంటే మరొక పక్క నేపాల్ లో ఇలా గౌరవిస్తూ ఉండడం చాలా గొప్ప విషయం .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -