Saturday, April 27, 2024
- Advertisement -

నేపాల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు..!

- Advertisement -

భారత్​-నేపాల్​ మధ్య కొద్ది నెలలుగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ నుంచి కాలాపానీ, లింపియధుర, లిపులేఖ్​ భూభాగాలను తిరిగి తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

జాతీయ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఓలి. ఆ దేశ విదేశాంగ మంత్రి జనవరి 14న భారత్​కురానున్న తరుణంలో ఓలి ఈ మేరకు వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరువాత సీనియర్​ నేతలు భారత్​లో పర్యటించటం ఇదే తొలిసారి.

భారత్​కు చెందిన మూడు కీలక ప్రాంతాలను కలుపుతూ గత ఏడాది కొత్త మ్యాప్​ను విడుదల చేసింది నేపాల్​. ఆ వెనువెంటనే పార్లమెంట్​ కూడా ఆమోద ముద్రవేసింది. దీనిపై స్పందించిన భారత్​.. నేపాల్​ చర్యను ఖండించింది. అది ఏకపక్ష చర్యగా పేర్కొంది. కృత్రిమ విస్తరణ ఆమోద యోగ్యం కాదని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను నేపాల్​ ఉల్లంఘిస్తోందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -