అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నిక

donald trump elected as us president

అమెరికా అధ్య‌క్ష రేసుకు రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీప‌డ్డ ట్రంప్ అనూహ్య రీతిలో అధ్యక్ష పీఠాన్ని గెలుచుకొని చ‌రిత్ర సృష్టించారు.  45వ అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌య్యారు.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించనివిధంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయకేతనం ఎగురవేశారు.  కీల‌క‌మైన స్వింగ్ స్టేట్స్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచ‌డంతో ట్రంప్ పార్టీ ఈజీగా విక్ట‌రీ కొట్టింది. అమెరికా 45 వ అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నికైన‌ట్లు అసోసియేటెడ్ ప్రెస్ ట్వీట్ చేసింది. ట్రంప్ పార్టీ 276, హిల్ల‌రీ పార్టీ 218 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకుంది.