- Advertisement -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ విజయం తథ్యమని ఓ సర్వే తేల్చింది. అమెరికన్లు ట్రంప్ ను గెలిపించాలనుకుంటున్నారు అని సర్వే నిర్వహించిన సంస్ధ పేర్కొంది. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి, డెమక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కంటే ముందున్నాడని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలపై రియల్ క్లియర్ పాలిటిక్స్(ఆర్ సీపీ) సంస్ధ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించింది. వీరు నిర్వహించిన సర్వే ప్రకారం 0.2 శాతం మంది హిల్లరి కంటే ట్రంప్ అభ్యర్ధిత్వంపైనే మొగ్గుచూపుతున్నారని పేర్కొంది.
ప్రస్తుతానికి ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం తక్కువేనని, ఎన్నికల చివరి క్షణాల వరకూ ఈ ఉత్కంఠ కొనసాగుతుందని సర్వేలో పేర్కొన్నారు.
