Saturday, May 18, 2024
- Advertisement -

స్వయంకృతాపరాధం అంటున్న విశ్లేషకులు

- Advertisement -

నల్ల ఎంజీఆర్ ఓటమికి కారణమేమిటి. కెప్టెన్ తన జట్టే కాదు.. తాను స్వయంగా పరాజయం పాలు కావడానికి చేసిన నేరమేమిటి. అంతా ఆయనే చేసుకున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమాగా ఉన్న విజయ్ కాంత్ ఎన్నికల ప్రచారంలో అనేకానేక తప్పులు చేశారు.

విజయం దరిచేరక ముందే విచ్చలవిడిగా ప్రవర్తించారు. ప్రచారంతో పాటు అన్ని విషయాల్లోనూ తానే ఎక్కువని ప్రవర్తించడం, కరపత్రాలపై సైతం తన బొమ్మనే పెద్దదిగా వేయాలని నిర్ణయించడం వంటివి ఆయన పరాజయానికి కారణమయ్యాయి. అలాగే మీడియాపై మాటిమాటికి విరుచుకుపడడం, సెక్యూరిటీ గార్డుపై చేయిచేసుకోవడం వంటివి ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు.

సెక్యూరిటీ గార్డును కొట్టిన వీడియోలు యూ ట్యూబ్ లో రావడంతోనే విజయ్ కాంత్ విజయానికి దూరమైట్లేనని పరిశీలకులు అంటున్నారు. వీటితో పాటు కొన్ని ప్రచార సభలకు తాగి రావడం, సొంతపార్టీ నేతలపై కూడా చేయి చేసుకోవడం వంటి అంశాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో ఓటర్లు విజయ్ కాంత్ ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాడోననే భయంతో ఆయనకు పరాజయాన్ని అంటగట్టారని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -