- Advertisement -

ఓడిన వారిలో శ్రీశాంత్.. విజయ్ కాంత్

- Advertisement -

ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. కేరళలోని తిరువనంతపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు శ్రీశాంత్ ఎల్డీఎఫ్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు.

కేరళలో యుడిఎఫ్ తరఫున పోటీ చేసిన మణి కూడా ఓటమి చెందారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో నటులు విజయ్ కాంత్, శరత్ కుమార్ పరాజయం పాలయ్యారు. వీరు జయలలిత పార్టీకి చెందిన అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ లో బిజెపి అభ్యర్ధినిగా పోటీ చేసిన రూపా గంగూలీ కూడా ఓడిపోయారు.

అలాగే పశ్చిమ బెంగాల్ లో ప్రముఖ నేతలు సూర్యకాంత్ మిశ్రా, దీపామున్షి సైతం పరాజయం పాలయ్యారు. జయలలిత, మమతా బెనర్జీల ధాటికి రాజకీయాల్లో కాకలు తీరిన నాయకులు ఓడిపోవడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -