Thursday, May 2, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌…

- Advertisement -

సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ట మ‌ధ్య కాసేప‌ట్లో ఆస‌క్తిక‌ర పోరు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌ సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.

గత మ్యాచ్‌లో భారత్‌పై నెగ్గిన ఇంగ్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. హార్డ్‌హిట్టర్ జేసర్ రాయ్ జట్టులోకి రావడం.. బెయిర్‌స్టో శతకంతో సత్తాచాడటంతో ఆ జట్టుగా జోరుమీదుంది. మరోవైపు పాకిస్థాన్, ఆస్ట్రేలియా చేతిలో వరుసగా ఓడిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాలని ఆశిస్తోంది.

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లేథమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, మాట్‌ హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -