Friday, May 3, 2024
- Advertisement -

తప్పు తెలుసుకున్న రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి మనకి తెలిసిందే. వీ ఐ ఆనంద్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే చాలా నెగటివిటీ ఉన్న సందర్భం గా నిన్న రవి తేజ సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు ఇప్పుడు పాజిటివ్ బజ్ ని తీసుకొని వస్తున్నాయి.

వివిధ కారణాల వలన ఈ సినిమా మీద నెగటివ్ బజ్ సంతరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకు ముందు రవి తేజ నుండి వచ్చిన సినిమాలు ప్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నా రవితేజ ఫిసికల్ అప్పియరెన్స్ ఒకే విధం గా ఉండటం, కనీసం జాగ్రత్తలు కూడా రవి తీసుకోకపోవడం తో అది ప్రేక్షకులకి, అభిమానులకి నచ్చలేదు. విమర్శకులు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని రవితేజ కి తెలియజేసినా కానీ రవి మాత్రం తన పంథా మార్చలేదు.

మొత్తానికి ఇప్పుడు డిస్కో రాజా సినిమా కి మాత్రం మంచిగా కసరత్తులు చేస్తూ తన ఫీజికల్ అప్పియరెన్స్ మార్చుకొనే ప్రయత్నం చేస్తుండటం కొంత ఆనందకరమైన విషయం.

https://www.instagram.com/p/BzZzK1ngHR4/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -