Wednesday, May 22, 2024
- Advertisement -

మీకు ఫేస్ బుక్ ఉందా ?

- Advertisement -

మొబైల్ లో ఫేస్ బుక్ యాప్ వాడే వారికి ఇది బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి మెసెంజర్ యాప్ లేకుండా సంక్షిప్త సందేశాలు పంపే ఛాన్స్ ఇకనుంచి ఉండదు. మెసెంజర్ యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య పెంచుకునేందుకు ఫేస్ బుక్ ఈ కొత్త రూల్ ను అమలు చేయడబోతోంది.

మెసెంజర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఇప్పటికే ఫేస్ బుక్ యూజర్లకు మెసేజ్ లు కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది మైబైల్స్ లో తక్కువ మెమొరీ సామర్థ్యం ఉంటుంది కాబట్టి.. సాధ్యమైనంత వరకు అన్నీ ఒకే యాప్ ద్వారా జరిగిపోయేట్లు చూసుకుంటుంటారు. కానీ ఫేస్ బుక్ మాత్రం తన డౌన్ లోడ్ల సంఖ్యను పెంచుకునేందుకు మెసెంజర్ యాప్ తప్పనిసరిగా ప్రత్యేకంగా ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.  వెబ్ లో దూసుకుపోతున్న ఫేస్ బుక్ మొబైల్ యూజర్స్ ను తనవైపు తిప్పుకుంటూ…

రోజురోజుకూ ఖాతాదారుల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది. యూజర్లను ఆకట్టుకునేందుకు వారు పెట్టే పోస్టులను విశ్లేషించేందుకు డీప్ టెక్స్ట్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే గనక సక్సెస్ అయితే ఫేస్ బుక్ యూజర్స్ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీప్ టెక్ట్స్ ఓకే అయితే దాదాపు 20 భాషల్లో పోస్టులను అత్యంత సులువుగా పెట్టేయొచ్చు. ఏదేమైనా మారుతున్న సమాజానికి అనుగుణంగా నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటున్న ఫేస్ బుక్… ఓ వైపు యూత్ ను ఆకట్టుకుంటునే తన మార్కెట్  పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -