Friday, May 3, 2024
- Advertisement -

నల్లగొండ మీద అందరి కళ్ళూ

- Advertisement -

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు కాంగ్రెస్ పై పడినట్లు కనిపిస్తోంది. జిల్లాల వారీగా ఆపరేషన్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ… ఇప్పటికే తెలంగాణ టీడీపీలోని 15మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీల్లో 12 మంది ఎమ్మెల్యేలు, ఉన్నఒక్క ఎంపీ కారెక్కేలా చేసింది.. మిగిలిన వారి సంగతెలా ఉన్నా.. మెజార్టీ నేతలు జంప్ అయిపోయారు.

ఇప్పుడు కాంగ్రెస్ లోనూ అదే జరుగుతుందేమో అనిపిస్తోంది.   కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాపై ఆపరేషన్ మొదలైనట్లు సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి బ్రదర్స్ అంతా కారెక్కే సూచనలు కనపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన రేపో మాపో గులాబీ పార్టీలోకి వెళ్తారేమోనని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న వెంకట్ రెడ్డి…ఇప్పటికే కారెక్కేందుకు తట్టాబుట్టా సర్దుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఎప్పుడో లైన్ క్లియర్ అయిపోయినట్లు ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. వీరే కాదు.. జిల్లాలో వీరి వెనకాల నడిచే మరికొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులతో టీఆర్ఎస్ ముఖ్యనేతలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఏదేమైనా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చూస్తుంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాల్లో ఫలానా వారు  ముఖ్యనేతలుగా ఉండేవారని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -