Tuesday, May 6, 2025
- Advertisement -

హీరో భార్యకు ఝలక్ ఇచ్చాడు

- Advertisement -

సోషల్ మీడియా శృతిమించిపోయాక ఎవరు ఎవరిని ఏం చేస్తున్నారో అస్సలు తెలియకుండా పోతోంది. అందుల్లోను సెలబ్రెటీల వ్యక్తిగత జీవితంలో ఎవరెవరో వచ్చి భయపెట్టేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఇదే విషయం మాలీవుడ్ హీరో వైఫ్ విషయంలో జరిగింది. మ‌ల‌యాళ స్టార్ హీరో జ‌య‌సూర్య వైఫ్ కు ఓ రాంగ్ కాల్ వ‌చ్చింది. మేడమ్ మీరు నాకు అర్జెంట్ గా 25000 ఇవ్వాలి అని చెప్పాడు. లేకపోతే మీ ఫేస్‌బుక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందని అన్నాడు.

దీనికి తోడు మేము హ్యాకర్స్ అని చెప్పడంతో సదరు హీరోయిన్ ఏమనుకుందో ఏమో వెంటనే ఆమె భర్త జయసూర్యకు విషయం చెప్పేసింది. స‌ద‌రు హీరో నేరుగా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. జ‌య‌సూర్య భార్య స‌రిత‌కు 8918419048 నంబ‌ర్ నుంచి కాల్ వ‌చ్చింది. ఆరా తీస్తే… `సైబ‌ర్ కాల్ సెంట‌ర్‌` పేరుతో ట్రూకాల‌ర్‌లో క‌నిపించింది. మీకు వ‌చ్చిన గూగుల్ వెరిఫికేష‌న్ కోడ్ మాకు షేర్ చేయండి.. అంటూ దుండ‌గుడు స‌రిత‌ను కోరాడు. అత‌డు కోరిన ప్రకార‌మే కోడ్ నంబ‌ర్‌ను షేర్ చేసిన స‌రితకు ఊహించ‌ని రీతిలో పాతిక వేలు పేటిఎం ద్వారా చెల్లించాలంటూ డిమాండ్ చేయ‌డంతో .. అనుమానంతో ఫోన్ కాల్ క‌ట్ చేశారు.

ఈ ఫ్రాడ్‌కాల్‌పై కామ‌న్ జ‌నాల‌కు అవేర్‌నెస్ పెంచేందుకు జ‌య‌సూర్య – స‌రిత జంట ఆన్‌లైన్‌లో ఆ నంబ‌ర్‌ను ఇప్పుడు పోస్ట్ చేశారు కూడా. ఈ తరహా మోస‌పూరిత‌మైన ఫేక్ కాల్స్ ని న‌మ్మొద్దంటూ ఆ దంపతులు ప్రచారం చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ స‌రిత ఎఫ్‌బిని హ్యాక‌ర్ల బారి నుంచి ఎలాగోలా విడిపించి స‌మ‌స్యను ప‌రిష్కరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -