వివాహేతర సంబంధాలు , భార్య భర్తల మధ్యన మనస్పర్థ లూ ఇలా ఒక్కొక్క విషయం ఒక్కొక్క లాగా సాగుతూ చివరికి హత్యల వరకూ దారి తీస్తూ ఉంటాయి. హైదరాబాద్ లోని అజీం హుస్సేన్ జీవితం ఇలాగే అర్ధాంతరంగా మారింది.
స్థానికంగా ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా పని చేసే ఇతను 18 సంవత్సరాల క్రితం అతని చెల్లి ని కార్డియాలజిస్ట్ అయిన మిరాజ్ కి ఇచ్చి పెళ్లి చేసాడు. అప్పటికే పెళ్లి అయిన మిరాజ్ అతని చెల్లి కోసం పాత భార్య కి విడాకులు ఇచ్చి ఈమెని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. గత మూడు నెలల కాలం లో భార్యా భర్తల మధ్యన మనస్పర్ధ లు తలెత్తాయి .. తీవ్రంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి.
లీగల్ గా రెండవ భార్య కి విడాకులు ఇవ్వకుండా మూడవ వివాహం చేసుకున్నాడు మిరాజ్. ఈ దెబ్బతో మొగుడూ పెళ్ళాం మధ్యన మరింత గొడవలు జరుగుతున్నాయి. భర్త తో గొడవ పెట్టుకుని మరీ పుట్టింటికి వచ్చేసిన ఆమె విషయం తన అన్నతో చెప్పింది. అజీం వెంటనే మిరాజ్ తో మాట్లాడడం కోసం ఆసుపత్రి కి వెళ్ళాడు. ఇద్దరి మధ్యనా మాటల యుద్ధం జరగడం తో అజీం సీరియస్ గా బయటకి వచ్చి ఒక పెద్ద ఆయుధం తో వెనక్కి వెళ్లి మిరాజ్ ని డాక్టర్ సీట్ లో కూర్చుని ఉండగానే పోడిచేసాడు. మిరాజ్ చనిపోయిన తరవాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు అజీం.