Saturday, May 4, 2024
- Advertisement -

అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి

- Advertisement -

2019-20కిగాను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దేశంలో కులమతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన జరగాలన్న జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు బుగ్గన చెప్పారు.

బ‌డ్జెట్ ముఖ్యాంశాలు..

వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతీ ఏడాది మే నెలలో ప్రతీ రైతుకు ఎకరానికి రూ.12500 2020,మే నెల నుంచి ఈ పథకం అమలవుతుంది.
ఇందుకోసంరూ.8750కోట్ల నిధులు కేటాయింపు.
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత, రూ.32618కోట్లు
వైద్య రంగానికి రూ.11399కోట్లు
గ‌‌ృహ నిర్మాణాలకు రూ.3617కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు
రైతు భరోసా పథకం కింద ఉచితంగా బోర్లు తవ్వించడానికి రూ.200కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్దికి రూ.1500కోట్లు,పాఠశాల నిర్వహణ గ్రాంటుకు రూ.160కోట్లు
ప్రకృతి విపత్తుల నిర్వహణకు రూ.2000కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ.1439కోట్లు
సంక్షేమ రంగానికి రూ.14,412కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.6455కోట్లు
ఆశావర్కర్లకు రూ.455.85కోట్లు
పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకానికి రూ.1077కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1140కోట్లు
ఏపీఎస్ఆర్టీసీకి రూ.1000కోట్లు
గిరిజన అభివృద్దికి రూ.4988కోట్లు
దళితుల అభివృద్దికి రూ.15వేల కోట్లు
వెనుకబడిన వర్గాల(బీసీ)ల అభివృద్దికి రూ.1561కోట్లు
వైఎస్ఆర్ గృహ పథకానికి రూ.1500కోట్లు
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.648కోట్లు
మత్స్యకారులకు సంక్షేమానికి రూ.410కోట్లు
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ రూ.1740కోట్లు
కాపు సంక్షేమానికి రూ.2వేల కోట్లు
అగ్రి గోల్డ్ బాధితులకు రూ.1150కోట్లు
కార్పోరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరించేందుకు చర్యలు.. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ భాష బోధన
జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.4960కోట్లు
సీఎం కాల్ సెంటర్‌కు రూ.73కోట్లు
రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి రూ.65కోట్లు
అటవీ,సైన్స్&టెక్నాలజీ కోసం రూ.477కోట్లు
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100కోట్లు
నాయి బ్రాహ్మణులు,రజకుల సంక్షేమ అభివృద్దికి రూ.300కోట్లు
కార్మిక,ఉపాధి రంగానికి రూ.978కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -