Saturday, May 4, 2024
- Advertisement -

ఆ అమ్మాయి ని పొగిడేస్తున్న ప్రభాస్ అభిమానులు

- Advertisement -

బాహుబలి తర్వాత సాహో సినిమా తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ని తెలుగు తో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా లో చాలా రోజుల తర్వాత ప్రభాస్ డాన్స్ తో అభిమానులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మిర్చి తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేస్తూ అభిమానుల ఆశల కి తగ్గట్టు గా సాహో ని తీర్చిదిద్దుతున్నాడు ప్రభాస్. అయితే మొన్న వచ్చిన పబ్ సాంగ్ లోనే ప్రభాస్ మంచిగా డాన్స్ చేసి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ప్రభాస్ విదేశాల్లో పాటల చిత్రీకరణ కి వెళ్ళాడు.

ఈ పాటల ని వైభవీ మర్చంట్ అనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్ చేసింది. ఆన్ లొకేషన్ స్టిల్స్ లో ప్రభాస్ ఈ లేడీ కొరియోగ్రాఫర్ తో సరదాగా గడుపుతూ కనిపించాడు. అయితే సినిమా కి సంబందించిన కొంత మంది ఈ విదేశాల్లో చేసిన పాటల్లో ప్రభాస్ చాలా అందం గా ఉంటాడు, డాన్స్ కూడా బాగా చేసాడు అని చెప్తున్నారు. ఆ లెక్కన చూస్తుంటే ఈ సారి అభిమానుల ఆశలని వైభవీ ప్రభాస్ చేత నిజం చేయిస్తుందట. ఇప్పటికే తెలుగు లో కూడా సినిమాలు చేసిన వైభవీ ప్రభాస్ ని ఎంత కొత్తగా చూపించబోతుంది అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -