Thursday, May 8, 2025
- Advertisement -

మొన్న టీడీపీలోకి వచ్చి అప్పుడే పదవులు కావాలా!

- Advertisement -

ఆమె మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. తీరా రాష్ట్ర విభజన జరిగి.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చే సరికి ఆమె జంప్ చేశారు. కుటుంబ సమేతంగా తెలుగుదేశంలో చేరారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ను.. తనయుడికి ఎంపీ టికెట్ ను సంపాదించుకొన్నారు. అయితే ఆమె ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె బాధపడుతున్నారు.

పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి పదవులు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పార్టీ నేతల సమావేశంలో గల్లా అరుణ ఈ విషయంపై స్పందించింది. లాబీయింగ్ చేసుకొని పదవులను సొంతం చేసుకొనే వారికే తెలుగుదేశంలో అనుకూల పరిస్థితి ఉందని ఆమె అంటోంది.

మరి అప్పుడే తెలుగుదేశం పార్టీలో గల్లా అరుణ ఇలాంటి ఆవేశాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే.. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరి కొంత కాలమే అయ్యింది. ఎమ్మెల్యేగా గెలవలేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ లో పాతకాపులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే గల్లా అరుణ ఇలాంటి అసంతృప్తి వ్యక్తం చేయడం విడ్డూరమే మరి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -