Sunday, May 5, 2024
- Advertisement -

గల్లా జయదేవ్ వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు!

- Advertisement -

అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు లోక్ సభ సభ్యుడు, హీరో మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో ఓ బ్రిడ్జిని ప్రారంభించేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గల్లా జయదేవ్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

కానీ నేటి ఉదయం కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు వెళుతున్న సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరులో కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఐటీసీ నిర్మించనున్న స్టార్ హోటల్ కు భూమి పూజ చేశారు. స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి గల్లా జయదేవ్ హాజరుకావాల్సి ఉంది. విమానంలో గన్నవరం చేరుకున్న జయదేవ్… అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా గుంటూరు బయలుదేరారు.

ఈ క్రమంలో రోడ్డుపై కనిపించిన ఓ కుక్కను తప్పించే క్రమంలో గల్లా కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న మట్టి గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడ తరలించిన అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -