గ్యాస్ వినియోగదారులకు షాకిచ్చింది కేంద్రం. వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. సబ్సిడీ, జనరల్ కేటగిరీ వినియోగదారులు అందరికీ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపారు.
అలాగే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే ఈ ధరల పెరుగుదల ప్రభావం వినియోగదారులపై ఉండదనన్నారు కేంద్రమంత్రి. చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రమే ఈ పెరిగిన ధరలను భరిస్తాయి అని వెల్లడించారు.
ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో దేశం అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని మొదట అందరూ భావించారు. అయితే, పెరిగిన ఈ ధరల భారాన్ని వాహనదారులకు బదలాయించే అవకాశం లేదని కేంద్రం తెలపడంతో కాస్త రిలీఫ్ దక్కింది. పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వస్తుందని చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది.