Monday, May 6, 2024
- Advertisement -

కేంద్రం నిర్ణయంపై సుధీర్​బాబు ఫైర్​ ..!

- Advertisement -

సినిమాటోగ్రఫీ చట్టం -1952ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సినిమా ప్రదర్శనకు సెన్సార్​ బోర్డు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే మళ్లీ ఆ చిత్రాన్ని ఆపేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని పలువురు బాలీవుడ్​ దర్శకులు, నటులు వ్యతిరేకించారు.

తాజాగా టాలీవుడ్​ నటుడు సుధీర్‌ బాబు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన వరస ట్వీట్లు పెట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు సెన్సార్​ బోర్డుకు ఏ విలువ ఉండదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేని సినిమాలు బయటకు రాకుండా ఆపుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న దర్శకుడు..!

‘కేంద్రం ఎటువంటి సినిమాలు రావాలనుకుంటే అటువంటి సినిమాలు మాత్రమే బయటకు వస్తాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తుంది. సీబీఎఫ్​సీ ఉండి ప్రయోజనం ఏమిటి? కథకులు, సృజనకారులు తమ స్వేచ్చను కోల్పోతారు’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: ఇంతకీ పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -