Wednesday, April 24, 2024
- Advertisement -

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

- Advertisement -

గత కొన్ని నెలలుగా దేశంలో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర భారీగా పెరిగింది. దీనికి తోడు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడం లాంటి పరిణామాలతో వంట నూనెల ధరలు చుక్కలనంటాయి.

అయితే ఇటీవలే ఇండోనేషియా ఈ నిషేధాన్ని ఎత్తేసింది. తాజాగా కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో సోయా, సన్‌ఫ్లవర్‌ వంట నూనెల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఏటా 20 లక్షల టన్నుల వరకు సుంకాలు లేకుండా రెండేళ్ల పాటు దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

అయితే సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అగ్రికల్చర్‌ సెస్‌ పేరుతో విధిస్తున్న 5 శాతం పన్నులు ఎత్తివేయడంతో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి.

ఆత్మకూర్ ఉప ఎన్నికల ఎప్పుడంటే ?

హైదరాబాద్‌కు ప్రధాని..బెంగళూరుకు సీఎం

జూన్ 1,2 తేదీల్లో టీపీసీసీ చింతన్ శిబిర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -