గజల్‌కు బెయిల్‌

ప్రముఖ కళాకారుడిగా వెలుగొందుతున్న గజల్‌ శ్రీనివాస్‌ చీకటి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో జనవరి 2న ఆయనను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.రూ.10వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతోపాటు వారంలో రెండు సార్లు నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది.చంచల్‌గూడా జైలు అధికారులు శ్రీనివాస్‌ను విడుదలచేసే అవకాశంఉంది.

ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా కోర్టులో ఊరట లభించింది. పార్వతి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరించారు. ‘సేవ్‌ టెంపుల్స్‌’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది శ్రీనివాస్‌పై ప్రధాన ఆరోపణ.