Friday, May 3, 2024
- Advertisement -

స్టాఫ్ కి పెళ్లి చేసిన హీరో సూర్య

- Advertisement -

పనిచేసే వారి బాగోగులు చూసుకుంటూ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేసే మనస్తత్వం మాత్రం కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో తాను ఉన్నానని ఋజువు చేసాడు హీరో సూర్య. తనకు – నాన్న శివ కుమార్ ఇంటి పనుల్లో సహాయకుడిగా ఉంటున్న మురుగన్ పెళ్లి వేడుకకు కుటుంబంతో సహా హాజరయ్యి తనే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు.తమిళ్ సంప్రదాయంలో కుటుంబ పెద్ద పెళ్లి కొడుకు చేతికి తాళిని స్వయంగా అందివ్వాలి. ఆది వాళ్ళకు ఆశీర్వచనం లాగా ఉంటుంది. ఈ బాధ్యతను కూడా సూర్యనే నిర్వర్తించాడు.

సూర్య – జ్యోతిక పెళ్లి పెద్దల్లాగా అంత దగ్గరుండి చూసుకున్నారు. నాన్న శివకుమార్ – తమ్ముడు కార్తి అందరు కుటుంబ సమేతంగా రావడంతో పెళ్లి మండపం కళకళలాడింది. దీంతో సూర్య ఫాన్స్ అతని పెద్ద మనసుకి మురిసిపోతున్నారు. ఈ వేడుక జరిగింది తిరుపతిలో. పెళ్ళికి అయిన ఖర్చు మొత్తం సూర్య తనే వ్యక్తిగతంగా భరించి వధూ వరులకు కొత్త కాపురానికి కావలసిన వాటికి సరిపడా ధన సహాయం కూడా చేసారట.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -