Thursday, May 9, 2024
- Advertisement -

బ‌హుబ‌లి ప్రభాస్‌ని ప‌క్క‌న పెట్టిన ఇవాంకా

- Advertisement -

ఇవాంకా ఏంటీ ప్ర‌భాస్‌ని ప‌క్క‌న పెట్టడం ఏంటీ అనుకుంటున్నారా? బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి తెలుగు సినిమా సత్తాను ఇండియానే కాగ ప్ర‌పంచం మొత్తం నిరూపించిన చిత్రం బాహుబలి. దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రానికి ప్రభాస్ వెన్నుముకగా నిలిచారు. ఈ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొనే సదస్సుకు దూరం కావడం చర్చనీయాంశమైంది.

ఆహ్వన పత్రంలో లేని ప్రభాస్ బాహుబలితో మంచి కమర్షియల్‌ హీరోగా సినీ వర్గాల నుంచి కొనియాడిన ప్రభాస్‌ను తొలుత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ప్రభుత్వం భావించింది. అయితే చివరి నిమిషంలో ఆహ్వానితుల జాబితాలో ప్రభాస్ పేరు లేకపోవడం ఓ వర్గాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

సినీ ప్రముఖులు దూరం ఇవాంకా నేతృత్వంలో జరిపే అంతర్జాతీయ సదస్సుకు ప్రభాస్‌ను ఆహ్వానించి పారిశ్రామిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచేలా చూడాలని భావించారట. అయితే ఆ తర్వాత సినీ ప్రముఖులను ఆహ్వానించడం వల్ల సదస్సు లక్ష్యం దెబ్బతింటుందని కొందరు వెల్లడించిన అభిప్రాయం మేరకు తమ ఆలోచనను మానుకొన్నారట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -