Thursday, May 9, 2024
- Advertisement -

బాబుది ప్రచార ఆడంబరం, మేనేజ్‌మెంట్ తెలివితేటలు….. వైఎస్, కెసీఆర్‌లు ఏం తక్కువ?

- Advertisement -

పబ్లిసిటీతో గొప్పవాళ్ళం అయిపోవడం ఎలా అనే తెలివితేటల విషయంలో మాత్రం చంద్రబాబు ప్రపంచానికి పాఠాలు చెప్పగలడు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ప్రచార ఆడంబరమే అన్నది నిజం. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన టైంలో, గతంలో సమైక్యాంధ్రప్రదేశ్‌కి దాదాపు దశాబ్ధం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు భజన మీడియా తప్ప ఆల్టర్నేటివ్ మీడియా లేదు కాబట్టి చంద్రబాబు హీరో అన్న ప్రచారాన్ని జనాలు నమ్మేలా చేయగలిగాడు. 2014లో ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రిగా కెసీఆర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో కెసీఆర్‌ని చంద్రబాబుతో పోల్చుతూ టిడిపి జనాలు, ఎల్లో మీడియా ఎంత ఎటకారం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ల్యాప్ టాప్‌ ఆపరేట్ చేయడం కూడా రాని జనాలు తెలంగాణా అసెంబ్లీలో ఉన్నారని ఎటకారం చేసి బ్యాన్ చేసేవరకూ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాళ్ళ బేరానికి వచ్చి బ్యాన్‌ని ఎత్తేయించుకున్నారు ఎల్లో మీడియా జనాలు. టెక్నాలజీ, డెవలప్‌మెంట్‌కి బాబు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలన్నది టిడిపి జనాల తాపత్రయం.

మూడున్నరేళ్ళ పాలనా కాలం తర్వాత చూస్తే చంద్రబాబుకు కెసీఆర్‌కి ఉన్న తేడా ఏంటో ఇట్టే అర్థమయిపోతోంది. గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడి ఇవాంకా పాల్గొనే బిజినెస్ మీట్‌ని హైదరాబాద్‌కి తీసుకురావడంలో కెసీఆర్ విజయవంతమయ్యాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఇవాంక వస్తున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా కెసీఆర్ హడావిడి కనిపించిందా? అసలు గత కొన్ని రోజులుగా కెసీఆర్ ఎక్కడైనా కనిపించాడా? కానీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని సాక్షాత్తూ అమెరికన్ ఎంబసీ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. మోడీ, ఇవాంకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉంటే, ఇవే ఏర్పాట్లు చంద్రబాబు చేసి ఉంటే చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా జనాలు బాబు గురించి ఏ స్థాయిలో భజన చేసి ఉండేవారో ఒక్కసారి ఊహించుకోండి. రోడ్లకు పెయింట్స్ వేస్తూ కూడా చంద్రబాబు ఒక ఫొటో దిగి ఉండేవాడనడంలో సందేహం లేదు. అన్ని పనులూ చంద్రబాబే దగ్గరుండి చూసుకుంటున్నాడని, ఇంకెవ్వరికీ పనులు చేతకావడం లేదని డప్పేసేవారు. తప్పులు దొర్లితే మాత్రం ‘మా బాబు 24 గంటలూ కష్ఠపడుతున్నా చేతకాని అధికారుల వళ్ళ తప్పులు దొర్లుతున్నాయి’ అని ఎల్లో మీడియా జనాలు రాగాలు తీసేవాళ్ళు. ఇవాంక హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రపంచ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు ప్రచార కుయుక్తులు విస్తుగొలుపుతున్నాయి. నిజానికి ఇవాంక, మోడీలు వైజాగ్ రావాల్సింది అట. బాబు ఇచ్చిన ప్రజెంటేషన్ అమెరికాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి వైజాగ్‌లో నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారట.

అయితే వైజాగ్‌లో ఫైవ్ స్టార్ హోటల్ లేకపోవడంతో పర్మిషన్ కేన్సిల్ చేశారట….. ఇదీ పచ్చ జనాలు సోషల్ మీడియాలోనూ, పచ్చ మీడియాలోనూ చేస్తున్న ప్రచారం. ఇలాంటివి విన్నప్పుడే సెప్పేటోడు సెంద్రబాబయితే …అన్న సామెత చెప్పాలనిపిస్తుంది. ఒకవైపు ఇలాంటి మాటలు చెప్పే అదే ఎల్లో మీడియా జనాలు మరోవైపు ఇవాంక కేవలం అమెరికా అధ్యక్షుడి కుమార్తెనేనని, అదే చంద్రబాబు అయితే గతంలో ఏకంగా అమెరికా అధ్యక్షుడినే రప్పించాడని, రీసెంట్‌గా వైజాగ్ వచ్చిన బిల్ గేట్స్ కంటే ఇవాంక ఎందులో గొప్పని కూడా వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. ఈ మాటలు అందని ద్రాక్ష పుల్లన తరహాలో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఇవాంక సామర్థ్యం ఏంటో, ఆ బిజినెస్ సదస్సు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలంటే ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనాలు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రతి విషయంలోనూ చంద్రబాబు ప్రచార ఆడంబరం ఇలానే ఉంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాడన్న విషయం ఒప్పుకోరు. అలాగే తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఘనత కూడా చంద్రబాబుకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి జనాలు. ఒప్పందాలు చేసుకుంది, ప్రారంభించింది వైఎస్సార్, పూర్తి చేసింది కెసీఆర్…..ఇక ఇందులో చంద్రబాబు ఘనత ఏంటి అంటే సమాధానం ఉండదు. అలాగే అంతర్జాతీయ విమానశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం క్రెడిట్ కూడా వైఎస్సార్‌కి దక్కుతుంది. కానీ టిడిపి భజన మీడియా మాత్రం అన్నింటినీ చంద్రబాబే నిర్మించాడన్న స్థాయిలో చెప్తూ ఉంటుంది. మరి అంతటి గొప్పవాడు అయితే మూడున్నరేళ్ళుగా రాజధాని నిర్మాణం ఎందుకు చేయలేకపోతున్నాడు? కనీసం ఒక్క శాశ్విత నిర్మాణం కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు? ప్రత్యేక హోదా తేలేకపోయాడు, ప్యాకేజ్ కూడా ఎందుకు తేలేకపోతున్నాడు? రైల్వేజోన్ ఏమైంది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు. గట్టిగా మాట్లాడితే ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నాడని చెప్తారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాష్ట్ర ఫ్రభుత్వ అధినేత స్థానంలో ఉన్న చంద్రబాబును ఏ అధికారమూ లేని, అధికారంలో ఉన్న ఏ ఒక్కరితోనూ భాగస్వామ్యంలేని జగన్ ఎలా అడ్డుకుంటున్నాడు? అంటే చంద్రబాబు చేతకాని తనం ఆ స్థాయిలో ఉందా?

గతంలో ఏమో కానీ మూడున్నరేళ్ళ చంద్రబాబు పాలనను పరిశిలీస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే. వయసు ప్రభావమో, లేక ఓటుకు కోట్లతో సహా తప్పుల ప్రభావమో కానీ చంద్రబాబు పూర్తిగా బలహీనమయిపోయాడు. మోడీతో కాదు కదా….కనీసం కెసీఆర్‌తో పోరాడే పరిస్థితుల్లో కూడా లేడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్పగా ఏమైనా చేసేంత సామర్థ్యం కూడా బాబుకు లేదనిపిస్తోంది. అయితే ఆయన అధికారంలో ఉండడం అవసరమైన ఎల్లో మీడియా జనాలు, టిడిపి అధికారంలోకి రావడం కోసం పెట్టుబడి పెట్టిన వాళ్ళు మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ బాబు హీరోయిజాన్ని ప్రతి రోజూ గొప్పగా ప్రచారంలో ఉండేలా చేస్తున్నారనిపిస్తోంది. పెద్ద పెద్ద విషయాల్లో ఎలాగూ విజయాలు సాధించలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక తాత్కాలిక నిర్మాణాలు, కాపర్ డ్యాం పనులు, బస్సుల ప్రారంభోత్సవాలు లాంటి వాటితో బాబు కూడా టైంపాస్ చేస్తున్నాడని అనిపిస్తోంది. టిడిపి బలంగా ఉంది అని చెప్పడానికి, వైకాపాను పూర్తిగా లేకుండా చేయడానికి మాత్రం ప్రజాప్రతినిధుల కొనుగోళ్ళు మాత్రం ఓ స్థాయిలో చేస్తున్నారు. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -