Wednesday, April 24, 2024
- Advertisement -

కరోనా టీకా సమాచారం ఇప్పుడు గూగుల్ చెంత..!

- Advertisement -

కరోనా టీకా ఏఏ ప్రదేశాల్లో వేస్తున్నారో గూగుల్​ సెర్చ్​ ద్వారా తెలుసుకోవచ్చు. వేర్వేరు దేశాలు వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభిస్తున్న తరుణంలో గూగుల్​ ఈ కొత్త ఫీచర్​ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తాము ఎన్నుకున్న ప్రదేశంలో ఇచ్చే వ్యాక్సిన్​ వివరాలు, ఇతర సమాచారాన్నీ తెలుసుకునే వీలు కల్పించింది. స్థానిక అధికార యంత్రాంగం సాయంతో ఈ డేటాను అప్​డేట్ చేస్తామని తెలిపింది గూగుల్.

కొవిడ్​-19 సంబంధిత సమాచారాన్ని ఈ ఏడాది మార్చి నుంచే తన వెబ్​సైట్ల ద్వారా ప్రత్యేకంగా అందిస్తోంది గూగుల్. యూట్యూబ్​లో వీటి వీక్షకుల సంఖ్య 400 బిలియన్​లకు చేరింది.కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి 100కిపైగా ప్రభుత్వ సంస్థలకు సుమారు 250 మిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చింది గూగుల్. అదనంగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు 15 మిలియన్​ డాలర్ల నిధుల్ని సమకూర్చినట్టు పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -