Saturday, May 4, 2024
- Advertisement -

అప్పుల ఊబిలోకి ట్రంప్ అల్లుడు..!

- Advertisement -

నష్టాల్లో కూరుకుపోయిన ఓ సంస్థకు రుణం అందించటంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అల్లుడు జేరడ్​ కుష్నర్​ పాత్ర ఉండే అవకాశం ఉందని పేర్కొంది మహమ్మారి​ సహాయ నిధి పర్యవేక్షణ కమిటీ. సదరు సంస్థకు సుమారు 700 మిలియన్​ డాలర్ల విపత్తు సహాయ రుణం అందినట్లు తెలిపింది. ఆ సంస్థ నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ప్రజల సొమ్ము నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

గురువారం జరిగిన విచారణంలో భాగంగా..’వైఆర్​సీ వరల్డ్​వైడ్’ అనే సంస్థకు రుణం మంజూరు చేస్తూ ట్రెజరీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని ప్యానల్​ ప్రశ్నించింది. నలుగురు సభ్యుల కాంగ్రెస్​ నిఘా కమిషన్​లో ఒకరైన భరత్​ రామమూర్తి ఈ మేరకు కుష్నర్​ పాత్రను ప్రస్తావించారు.

జాతీయ భద్రతకు వైఆర్​సీ వ్యాపారం కీలకమంటూ రుణం ఇవ్వటాన్ని ప్యానల్​ సభ్యులు ప్రశ్నించారు. ట్రెజరీ విభాగం కార్పొరేట్​ సహాయ కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇంత భారీ మొత్తంలో రుణాలు ఇవ్వటం ఇదే తొలిసారి కావటం అనుమానాలకు తావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -