వైఎస్ఆర్ కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. కడప జిల్లా వీఎన్ పల్లి మండలం ఈర్లపల్లిలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి. టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాస్కర్ రెడ్డిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు భాస్కరరెడ్డి, వాసుదేవరెడ్డి తో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డికి సుదీర్ఘ కాలంగా విభేధాలున్నాయి. అయితే గురువారం నాడు ఇరు వర్గాల మధ్య పంచాయితీ రాజీ విషయమై ఈ ఘటన చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.
భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఓ పంచాయితీ విషయంలో రాజీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొందని సమాచారం. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసు కోవడంతో శ్రీనివాస్ రెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన బంధువు వాసుదేవ రెడ్డిపై శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపారు. ఈఘటనలో గాయపడిన బాధితులను వెంటనె ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.