Wednesday, May 1, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..కడప నుండే షర్మిల!

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది. 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేయనుంది కాంగ్రెస్. అలాగే ఏపీసీసీ చీఫ్ షర్మిల అంతా ఊహించినట్లుగానే కడప నుండి పోటీ చేయనున్నారు. ఇక ఇప్పటికే 9 గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. ఈ గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, విశాఖ నుండి నిర్మాత సత్యారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక కడప నుండి షర్మిల పోటీ చేస్తుండగా పోరు ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ ఈసారి వాపమక్షల పొత్తుతో బరిలో దిగనుంది. అయితే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ విభజన తర్వాత గత రెండేళ్లలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకు మాత్రమే సాధించిన నేపథ్యంలో ఈసారైనా కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -