ముంబై వరస పేలుళ్లలో ప్రధాన దోషుల్లో ఒకడిగా ఉరి శిక్షను ఎదుర్కొంటున్న యూకూబ్ మెమన్ పై సల్లూ భాయ్ పాజిటివ్ గా స్పందించాడు. అతడికి ఉరి శిక్షను అమలు చేయాల్సిన అవసరం లేదని సల్మాన్ ట్వీట్ చేశాడు.
ఈ విధంగా సల్మాన్ ఒక ఉగ్రవాదికి మద్దతు పలికి ఒక విధంగా సంచలనం సృష్టించాడు. అయితే సల్మాన్ టైగర్ మెమన్ పై మాత్రం ధ్వజమెత్తాడు. యాకూబ్ మెమన్ ను కాదు.. టైగర్ మెమన్ ను పట్టుకొని వచ్చి ఉరి తీయాలని సల్మాన్ ట్వీట్ చేశాడు.
ఇంతకీ సల్మాన్ ఏమంటాడంటే.. ముంబై వరస పేలుళ్ల ప్రధాన దోషి యాకూబ్ కాదు, టైగర్ మెమన్. అయితే టైగర్ మెమన్ పారిపోయాడు. అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అయితే ఈ కుట్ర లో భాగస్వామి అయిన యాకూబ్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో అతడు దోషిగా తేలాడు. ఉరి శిక్ష కూడా పడింది. అయితే ఇప్పటి వరకూ అది అమలు కాలేదు. త్వరలోనే ఆ శిక్ష అమలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కొంతమంది యాకూబ్ కు మద్దతు పలుకుతున్నారు.
ఇలాంటి వారిలో సల్మాన్ కూడా ఒకరు. వరస బాంబు పేలుళ్ల నిందితుడు టైగర్ అని. .అతడిని పట్టుకొని వచ్చి బహిరంగ ఉరిని విధించాలని సల్మాన్ అన్నాడు. ఇక్కడ తమ్ముడిని ఉరి తీస్తుంటే.. టైగర్ ఎక్కడో ఉన్నాడని.. పారిపోయాడని.. అలాంటి వాడు టైగర్ ఎలా అవుతాడు? అని కూడా సల్మాన్ ప్రశ్నించాడు. మరి ప్రధాన దోషి కాదు.. అంటూ వీళ్లంతా యాకూబ్ కు మద్దతు పలుకుతున్నారు. ఇది సబబేనా? అనే ప్రశ్నకు.. ఆలోచనా విధానాన్ని బట్టి సమాధానం మారుతూ ఉంటుంది!