- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం అంతా ఎండగొట్టగా ఒక్కసారిగా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుండి పెరిగిన ఎండల కారణంగా గాల్లో తేమ శాతం పెరిగింది.

గాల్లో పెరిగిన తేమ శాతం కారణంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, షేక్‌పేట్‌ పలు ప్రాంతాల్లో కురుస్తున్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వార్నింగ్ ఇచ్చింది.
ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ మరియు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -