- Advertisement -

మేం చేసింది ఎక్కువ..చెప్పుకుంది తక్కువ!

- Advertisement -

మా హ‌యాంలో మేము చేసింది ఎక్కువ.. చెప్పుకుంది త‌క్కువ‌ అన్నారు మాజీ సీఎం జగన్. టెండ‌ర్ల‌లో పాల్గొనే వారికి ఇదే నా వార్నింగ్‌.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం అన్నారు. అయినా బ‌రితెగించి మెడిక‌ల్ కాలేజీల‌ను అమ్మేస్తే.. మేము వ‌చ్చాక క‌చ్చితంగా వెన‌క్కి తీసుకుంటాం.. టెండ‌ర్ల‌లో పాల్గొనే వారికి ఇది నా వార్నింగ్‌ అన్నారు.

మెడిక‌ల్ సీట్లు వ‌ద్ద‌ని కేంద్రానికి లేఖ రాసే ముఖ్య‌మంత్రి ఎక్క‌డైనా ఉంటాడా..?, ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేయ‌డం అంటే…ప్ర‌జ‌ల ఆరోగ్యం, పేద‌ల ఆరోగ్యం ప‌ట్ల చంద్ర‌బాబుకు లెక్క‌లేని త‌నం అన్నారు. అస‌లు ప్ర‌భుత్వం.. స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ బ‌స్సులు, ఆస్ప‌త్రులు ఎందుకు న‌డుపుతుందో తెలుసా అన్నారు.

రాష్ట్రంలో పాల‌న పేద‌ల కోస‌మా.. దోపిడీ దారుల కోస‌మా..?, విద్యా, వైద్యం, వ్య‌వ‌సాయం ప్రైవేట్ వ్య‌క్తుల దోపిడీకి గుర‌వుతోంది… దేశంతో పోల్చితే రాష్ట్ర ఎకాన‌మీ తిరోగ‌మ‌నంలో ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -