Sunday, May 19, 2024
- Advertisement -

వైసీపీలోకి నటి హేమ..?

- Advertisement -

నటి హేమ.. ఇప్పటికే ఈమె చాలా సినిమాలో కమెడియన్ కు భార్యగా… వదినగా.. అత్తగా.. అమ్మగా నటించి మెప్పించింది. అయితే ఇటివలే ఈమె ‘మా” ఎన్నికల సందర్భంగా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఎక్కువ సినిమాల్లో బ్రహ్మానందంకు జోడీగా నటిస్తూ, కామెడీ పండించే ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏమాత్రం వెనక్కి తగ్గదు. అయితే ఇప్పుడు ఈమె ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా వుండే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

గతంలో హేమ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చూసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో నటి, కాపు సామాజిక వర్గం మహిళా నేతగా పేరు తెచ్చుకున్న హేమ త్వరలోనే వైసీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే హేమను పార్టీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో ప్రధాన మహిళా నేతగా ఉన్న రోజాకు చెక్ చెప్పేందుకు హేమను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు. త్వరలోనే జగన్ సమక్షంలో నటి హేమ పార్టీలో చేరుతానని.. పార్టీ వర్గాల సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -