అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయిన బెజవాడ తెలుగుదేశం నేతలపై ఆ పార్టీ అధినేత ఎలాంటి చర్య తీసుకోలేదు.. మీడియా సాక్షిగా బెజవాడ నడిబొడ్డున ఓ బ్యూరోక్రాట్ ను నిలబెట్టి మరీ ప్రజాప్రతినిధులు కొట్టినంత పని చేస్తే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలూ ఉండవు. ఇదేం దారుణం అని అడిగితే.. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కదా.. కౌన్సెలింగ్ ఇచ్చారు కదా.. సారీ చెప్పించారు కదా.. అని తెలుగుదేశం శ్రేణులు చెప్పుకొస్తాయి.
ఓ ఐపీఎస్ అధికారిని నిలబెట్టి.. అతని గన్ మెన్ పై చేయి చేసుకుంటే.. అన్నీ చూస్తూ పళ్ల బిగువున సదరు ఆఫీసర్ నేతల దౌర్జన్యాన్ని భరించిన దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. కానీ యథాప్రకారం ఆ విషయం మరుగునపడిపోయింది. ఈ వ్యవహారాన్ని కూడా సీఎం సెటిల్ మెంట్ చేశారని వైసీపీ నేతలు అప్పట్లోనే ఆరోపణలు గుప్పించారు. ఆ విషయం అంతటితో ముగిసిపోయింది.
అయితే తాజాగా బెజవాడ టీడీపీ నేతలకు పెద్దషాకే తగిలింది.ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, సిబ్బందితో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా , ఎమ్మెల్సీ బుద్దా దుర్భాషలాడుతూ, దురుసుగా ప్రవర్తించారంటూ గత నెల 27న ఐపీఎస్‌పై గుండాగిరి అని సాక్షి ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు లెటర్ రాశారు. ఈ లేఖను పరిశీలించి పిల్ గా స్వీకరించారని కోరారు. ఎంపీ కేశినేని నాని బాలసుబ్రమణ్యంపై విరుచుకుపడ్డారు. గడ్డితిని ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను నడిపిస్తున్నావ్.ప్రజా ప్రతినిధి అంటే నీకు లెక్కలేదా.ఝఫ? నీసంగతి తేలు స్తాని నానాబూతులు మాట్లాడారు. అదే సంయంలో ఎంపీ బొండా ఉమామహేశ్వర్ కూడా ఏంనీకు కొమ్ములొచ్చాయా..? పై నుంచి దిగివచ్చావా..? నీబతుకు ఎంతని …కమీషనర్ ను తూలనాడుతూ చిందులు తొక్కారు. కేశినేని నాని,బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న,విజయవాడ మేయర్ కోనేరు శ్రీధరతోసహా 200 మంది కార్యకర్తలతో కమీషనర్‌ను విజయవాడరోడ్డుపై నిర్భందించారు. ఈఘటనను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సాక్షి కథనాన్ని పిల్‌గా స్వీకరించి రేపు విచారన చేపట్టనుంది.
Related