Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు

- Advertisement -
babu fear about lokesh

ఏపీసీఎం చంద్ర‌బాబు నాయుడి ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుఎలాగా త‌యార‌య్యింది. రాజ‌కీయంగా త‌న ఇమేజ్‌ని  పార్టీఇమేజ్ నీ న‌డిపిస్తాడ‌ని పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ చిన‌బాబు గంగ‌లో క‌లిపేస్తున్నారు.తెలంగాణాలో కేటీఆర్ తండ్రి,పార్టీ ఇమేజ్‌ను పెంచుతుంటే ఏపీలో మాత్రం లోకేష్ బాబు ఇమేజ్ ని దిగ‌జారుస్తున్నారు.దీంతో బాబు క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. లోకేష్  చేష్ట‌ల‌తో  బాబు ప‌రువు బ‌జారుకీడుస్తున్నారు.

కుమారుడిని రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చారు. ముందుగా  టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ముందుగా జాతీయంగా లోకేష్‌కి ఇమేజ్‌ని తీసుకొచ్చేందుకు బాబు చేసిన ప్ర‌య‌త్నం ప‌లించ‌లేదు. దీని వ‌ల్ల బాబుకు ఒర‌గిందేమిలేదు. పైగా తెలంగాణాలో  పార్టీనీ  స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌న్న ఆరోప‌న‌లు బాబు మూట‌గ‌ట్టుకున్నాడు. ఇల లాభం లేద‌నుకొని ఏపీలో న‌న్న కుమారుడిని రాజ‌కీయంగా పైకితీసుకురావ‌ల‌న్న లక్ష్యంతో వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా గెల‌వ‌లేడ‌ని తెలిసి దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ప‌ద‌విక‌ట్ట‌బెట్టాడు బాబు గారు. ఉత్త ఎమ్మెల్సీ ప‌ద‌వి  ఇస్తే ఏంబాగుంటుంది కోడుకు ఇమేజ్ పెర‌గాలంటే మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌నిస‌రి….. మ‌రి ఎలాగైతేనేమి కుమారున్ని మంత్రిప‌ద‌విలో కూర్చొబెట్టి మురిసిపోయాడు బాబు. చిన బాబు తీరుతో అది కూడా మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే ఉండిపోయింది. 

ఎలాగైతేనేం, నారా లోకేష్‌ మంత్రి అయిపోయారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదంటూ పార్టీ నేతలద‌గ్గ‌ర  చంద్రబాబు డ‌ప్పాలు కొట్ట‌డం మొద‌లెట్టేశారు.   చిన‌బాబును పొగ‌డ‌కుంట‌గే త‌మ‌కు ఎక్క‌డ ఇబ్బంద‌లు వ‌స్తాయేని పొగ‌డ‌టం మొద‌లెట్టేశారు . ఏకంగా  ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవలే లోకేష్‌ని కాబోయే ముఖ్యమంత్రి.. అంటూ ఉబ్బేశారు. దీనికి  కొంద‌రు టీడీపీనేత‌లు వంత‌పాడుతున్నారు.లోకేష్‌ మంత్రి అవ్వడమంటే తేలిగ్గానే జరిగిపోయిందిగానీ, మంత్రికి వుండాల్సిన హుందాతనం, మంత్రిగా చూపించాల్సిన మాటకారితనం.. ఇవేవీ ఆయనలో కన్పించడంలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ టీడీపీలోనే కొందరు లోలోప‌ల తిట్టుకుంటున్నారు… మీడియాకి లీకులూ అందిస్తున్నారు. 

ఓవైపు తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడుతుంటే.. నారా లోకేష్ మాత్రం తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. అసందర్భమైన మాటలతో, అనాలోచిత వ్యాఖ్యలతో లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్న లోకేష్.. అడ్డంగా బుక్కవుతున్నారు.

అంబేద్కర్‌ జయంతికీ, వర్దంతికీ తేడా తెలియకుండా వ్యవహరించడం, తాగునీటి సమస్యను సృష్టిస్తాననడం.. ఇక అనంత‌పురంలో మాత్రం 200 సీట్ల‌లో పార్టీని గెలిపించాన‌డం ఇలాంటి ప‌రిప‌క్వ‌త‌లేని మాట‌లు మాట్లాడ‌టం వ‌ల‌న ప్ర‌తీ సారి అభాసుపాల‌వుతున్నారు. ఏదో మొద‌ట్లో తెలీయ‌ద‌నుకుంటే లోకేష్ లో ఏమాత్రం మార్పుక‌నిపించ‌డంలేదు. చాలామంది చినబాబు పార్టీ పరువు తీసేస్తున్నారనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క, మంత్రి అయ్యాక లోకేష్‌ పూర్తిగా పార్టీ వ్యవహారాల్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చంద్ర‌బాబు ముందుగా  లోకేష్‌కు   ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో  అవ‌కాశం క‌ల్పించి అనుభ‌వం వ‌చ్చాక మంత్రిప‌ద‌వి ఇచ్చింటే బాగుండేద‌ని పార్టీలో సీనియ‌ర్‌లు  మాట్లాడుకుంటున్నారు. ఏంలాభం  చేతులు కాలాకా అకులు ప‌ట్టుకుంటే ప‌లితం ఏముంటుంది… జరగాల్సిన ‘ఘోరం’ జరిగిపోయింది. చినబాబు ‘తప్పుల్ని’ కవర్‌ చేసుకోవడం తప్ప చంద్రబాబు అయినా, టీడీపీకి చెందిన ఇతర నేతలైనా చెయ్యగలిగిందేమీ లేదు. ఇక ఏదైనా పార్టీఅధికార కార్య‌క్ర‌మాలు,క ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు లోకేష్‌ను ఆహ్వానించాలంటే నాయ‌కులు హ‌డ‌లెత్తిపోతున్నారు. ల‌కేష్  పార్టీకీ ప్ల‌స్ అవుతార‌నుకుంటే …చివ‌రికి మైన‌స్ గా మారిపోయంది. అన్నీ మ‌నం అనుకున్న‌ట్లు జ‌రుతాయ అనుకోవ‌డం త‌ప్ప ఇప్పుడు చేసేదేమిలేదు. 

Related

  1. ఆస‌క్తిని రేపుతున్న నంద్యాల బైపోల్‌ బాబు మాటంటే లెక్క‌లేదు
  2. కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ను వినియేగించ‌కుండా మార్గ‌ద‌ర్శ‌ కాలు జారీ చేసిన కేంద్రం
  3. బాబుకి దిమ్మ‌తిరిగేలా చేసిన 9 త‌ర‌గ‌తి అమ్మాయి
  4. బాబ్రి విధ్వంసం కేసులో  బీజేపీ  అగ్ర‌నేత‌ల‌పై కుట్ర జ‌రుగుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -