వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే కసితో ముగ్గురు సోదరులు కలిసి జావీద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
రెయిన్ బజార్ పోలీసుల కథనం ప్రకారం.. రహేమత్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత అరబ్ దేశంలో ఉంటోంది. ఆమెకు మహ్మద్ సోహెల్ (23), మహ్మద్ సులేమాన్ (21) అనే కొడుకులున్నారు. తన భర్తకు అక్క కొడుకైన జావిద్ (33)తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన భర్త, పిల్లలు కూడ చెప్పినా కూడ ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. దీంతో భార్య ప్రవర్తనతో విసిగిన ఆమె భర్త మరో మహిళతో సహ జీవనం చేస్తూ వేరే చోట ఉంటున్నాడు.
తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి మరో వ్యక్తికి దగ్గర కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమారులు జావిద్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. సవతి తల్లి కుమారుడైన మహ్మద్ ఈసా (21)లో కలిసి జావిద్ హత్యకు కుట్ర పన్నారు. గురువారం రాత్రి వివాహిత అరబ్ నుంచి కుమారుల కోసం జావిద్ ద్వారా డబ్బులు పంపింది. ఆ డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన జావిద్‌పై ముగ్గురూ మారణాయుధాలతో దాడిచేశారు. గొంతు, కడుపులో కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. అనంతరం అతడి మర్మాంగాలు కోసం హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు