హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను, నాలాలను ఆక్రమించిన వారిపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇక హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పేదలు ఇళ్లను కూడా కూలగొట్టరన్న అపవాదు మూటగట్టుకుంది హైడ్రా.
అయితే ఇవేమి పట్టించుకోని హైడ్రా కమిషనర్ రంగనాథ్… ఇందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబరు 1070 అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఫిర్యాదు దారులు ఎవరైన ఫోన్ చేయవచ్చని తెలిపారు.
మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. చెట్లు పడిపోయినా, వరద ముంచెత్తినా, అగ్ని ప్రమాదాలు జరిగినా ఇలా ప్రమాదకరమైన పరిస్థితులున్నప్పుడు హైడ్రాకు సంబంధించిన సేవలన్నిటికోసం టోల్ ఫ్రీ నంబరు 1070 ద్వారా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు 8712406899 నంబరుకు సమాచారం ఇవ్వడంతో పాటు.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించవచ్చునని రంగనాథ్ తెలిపారు.
