- Advertisement -

నా తల్లిని అవమానించారు..మోదీ భావోద్వేగం

- Advertisement -

నా తల్లిని అవమానించారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. బీహార్‌లో జరిగిన ఆర్జేడీ-కాంగ్రెస్ సభలో తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ప్రధాని.

నా తల్లి ఇప్పుడు ఈ లోకంలో లేదు.. నా తల్లికి రాజకీయాలతో కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాంటి నా తల్లి గురించి ఆర్జేడీ-కాంగ్రెస్ సభలో దూషించడం బాధగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు.

రాజకుటుంబాల్లో పుట్టిన ఈ ‘యువరాజులు’ పేద తల్లి చేసిన త్యాగం, కొడుక్కి కలిగే బాధ అర్థం చేసుకోలేరు. దేశ అధికారమూ, బిహార్ అధికారమూ తమ కుటుంబ వారసత్వమేనని భావిస్తున్నారు. కానీ ప్రజలు పేద తల్లి కొడుక్కి ఆశీర్వదించి ప్రధాన సేవకుడిగా మార్చారు. అది వారికీ జీర్ణించట్లేదు అని విమర్శించారు.

మహిళలను అవమానించే మనస్తత్వమే ప్రమాదం అని..తల్లిని, అక్కను దూషించే మనస్తత్వం, మహిళలను బలహీనంగా చూడే మనస్తత్వం. అటువంటి పాలనలో ఎప్పుడూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఎక్కువగా నష్టపోతారు. ఆర్‌జేడీ పాలనలోనే బిహార్‌లో హత్యలు, అపహరణలు, అత్యాచారాలు జరిగాయన్నారు మోదీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -