Sunday, May 12, 2024
- Advertisement -

ఆరోపణలకు సమాధానమిచ్చిన ఫ్రాన్సిస్కా

- Advertisement -

మత గురువుతో వాటికన్ చర్చిలో తాను శృంగారంలో పాల్గొన్ననంటూ చేసిన ఆరోపణలను మాజీ పబ్లిక్ రిలేషన్ కన్సల్టెంట్ అయిన షావ్‌కీ ఖండించిది. వాటిలీక్స్ -2 పేరుతో విడుదలైన పత్రాల్లో ఫ్రాన్సిస్కా షావ్‌ కి వాటికన్ చర్చి మత గురువు స్పానిష్‌మొన్సిగ్నర్ లువియో వాలెజో బాల్డాకి మధ్య సంబంధాలున్నట్లు లీకైంది.

వాటిలీక్స – 2 పత్రాలను తాను లీక్ చేసిన మాట వాస్తవమేనని, అయితే పర్గీకరించిన పత్రాలను మాత్రమే జర్నలిస్టులకు ఇచ్చానని బాల్డా చెబుతున్నారు. షావ్ తో తన అనుబంధం మత గురువుకు ఉన్న అనుబంధం వంటిదేనని, అయితే ఫ్రాన్సిస్కా మాత్రం తనను లోబరుకోవాలని చూసిందని బాల్టా చెబుతున్నారు.

 ఫ్లోరెన్స్ హోటల్‌లో 2014 డిసెంబర్‌లో బాల్డాతో తాను శృంగారంలో పాల్గొనలేదని, అసలు అలాంటి ఘటన జరుగలేదని నిందితురాలు షావ్‌కీ తాజాగా కోర్టుకు తెలిపారు. ఈ రహస్య వివాదం రోజురోజు పెరుగుతూ పలువురిని వీధుల్లోకి లాగుతోందని అటు మత గురువులు, ఇటు సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -