Thursday, May 16, 2024
- Advertisement -

చైనా, పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉడండి…

- Advertisement -
IAF asked to be ready for ‘wars’ with Pakistan, China

అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న‌యుధ్ద‌వాతార‌ణ మేఘాలు ఇప్పుడ భార‌త్ మీద ప్ర‌భావాన్ని చూపుతున్నాయి.ఇప్ప‌టికే ఉత్త‌ర‌కొరియా,అమెరికాల మ‌ధ్య యుధ్దం ఏక్ష‌ణ‌మైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న సంకేతాల‌తే ఇండియాకూడా అప్ర‌మ‌త్త‌మ‌యింది.

మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్‌తో పది రోజుల పాటు, చైనాతో పదిహేను రోజుల పాటు యుద్ధం చేసేందుకు వీలుగా సన్నద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) తన కమాండర్లను ఆదేశించింది. గత వారం న్యూఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్ చీఫ్ ధనోవా ఈ మేరకుకమాండర్లకు సంకేతాలు పంపించినట్లు విశ్వ‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.
ఇప్ప‌టికే జాద‌వ్ ఉరినేప‌థ్యంలో పాకిస్థాన్ ఇండియామ‌ధ్య మాట‌ల యుధ్ధం కొన‌సాగుతోంది. అటు పాకిస్థాన్ కూడా జాద‌వ్ ఉరివిష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌క పోవ‌డంతో ప‌రిస్థితులు ఏవిధంగా ఉంటాయే తెలియ‌ని ప‌రిస్థితుల్లో …ఒకవేళ పాకిస్థాన్‌తో పదిరోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనడానికి వీలుగా ఐఏఎఫ్‌ కమాండర్లు స్వరసన్నద్ధంగా ఉండాలని ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా ఆదేశించారు. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు’ అని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి.
తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలుపాలంటూ ఇప్పటికే డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎయిర్‌​ స్టాఫ్‌ ఇన్స్‌ఫెక్షన్‌కు ఆదేశాలు అందాయి. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని, యుద్ధవిమానాలకు పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్‌ రాడర్‌ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి.దీంతో ఎప్పుడు ఏంజ‌రుగ‌తుందోన‌న ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}Z1yv0RNDtgc{/youtube}

Also Read

  1. ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు
  2. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు
  3. కొరియాస‌మీప‌జ‌లాల్లోకిఅమెరికా యుధ్ద‌నౌక‌లు-యుధ్ద‌వాతా వ‌ర‌ణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -