దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలు ఢాకా గ్లేషియల్ లో బయటపడ్డాయి. భారత వాయుసేన చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇది ఒకటి.1968, ఫిబ్రవరి 7న 98 మంది రక్షణ శాఖ సిబ్బందితో లాహుల్ – స్పితి జిల్లాలో ఉన్న ఢాకా గ్లేసియర్ లో ఏఎన్-12, బీఎస్-534 విమానం అదృశ్యమైంది.
అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది.1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో లేహ్ ఎయిర్ పోర్టుకు చేరలేకపోయిన విమానం, వెనక్కు తిరిగి చండీగఢ్ కు వెళుతూ, రోహ్తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది.ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు
2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు, విమానంలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయిన జవాను బేలీరామ్ మృతదేహాన్ని ఓ ప్రాంతంలో గుర్తించారు. దీంతో తిరిగి విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మరికొన్ని మృతదేహాలు అదే ప్రాంతంలో కనిపించాయి. ఆపై 2009లో గాలింపును పూర్తిగా నిలిపివేశారు.
గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. దీంతో నిన్న పలు ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఆయిల్ ట్యాంక్, కాక్ పిట్ డోర్ వంటివి లభ్యమయ్యాయి.