Monday, April 29, 2024
- Advertisement -

IAF యుద్ధవిమానం అదృశ్యం…13మంది సిబ్బంది గ‌ల్లంతు..

- Advertisement -

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్రాంతంలో అదృశ్యమయ్యింది. అస్సాంలోని జోర్‌హాట్ నుంచి ఆంట‌నోవ్ 32 విమానం.. సోమవారం మధ్యాహ్నం 12.25 నిమిషాల‌కు టేకాఫ్ అయ్యింది. ఈ విమానం అరుణాచ‌ల్ ప్రదేశ్‌లోని మెచుకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌‌తో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.

సాధారణంగా సరకు రవాణా కోసం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని భారత వైమానిక దళం వినియోగిస్తూ ఉంటుంది. ఆచూకీ గల్లంతైన విమానంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. వీరులో ఏడుగురు సిబ్బంది, ఐదుగురు ప్రయాణీకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చర్యలు చేప‌ట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విమానం ఆచూకి దొర‌క‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -