Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Friday, September 18, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home News ఆధార్ ఎవ‌రైనా అడిగితే కోటి రూపాయ‌ల జ‌రిమానా, క్రిమిన‌ల్ కేసు…

ఆధార్ ఎవ‌రైనా అడిగితే కోటి రూపాయ‌ల జ‌రిమానా, క్రిమిన‌ల్ కేసు…

December 19, 2018
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాల‌కు , అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసింది కేంద్రం. అయితే ఇక‌నుంచి ఫ్రూప్‌కు ఆధార్ నెంబ‌ర్ ఇవ్వాల్సి న ప‌నిలేదు. ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థపై రూ. కోటి జరిమానా విధించాలని, అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌కు కేబినేట్ ఆమోదం తెలిపింది.

    కేవైసీ ఫార్మాలిటీస్ లో ఆధార్ తప్పనిసరేమీ కాదని, దాని స్థానంలో ఇతర ఏ కార్డుల జిరాక్సులైనా సమర్పించ వచ్చని, ఆధార్ మాత్రమే కావాలని అడగటం నేరమని పేర్కొంది. కేవలం కేంద్ర నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని, మరే ఇతర సేవలకూ ఆధార్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశం తేల్చింది.

    రాష్ట్ర ప్రభుత్వాలు కావాలంటే, తమ తమ ప్రాంతాల్లో ఆధార్ ను తప్పనిసరి చేసుకునే వెసులుబాటును కల్పించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఇక ఆధార్ లోని వివరాలను ట్యాంపర్ చేసినా, ఎవరికైనా విక్రయించినా, డేటాను మిస్ యూజ్ చేస్తే రూ. 50 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలుశిక్ష విధించేలా చట్ట సవరణకు ప్రతిపాదించింది.

    Previous articleఐపీఎల్ వేలం: అమ్ముడుపోని యువ‌రాజ్ సింగ్‌
    Next articleనింగిలోకి మ‌రో ఇస్రో బాహుబ‌ళి….
    G SRI REDDY

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy