Thursday, May 2, 2024
- Advertisement -

ఐపీఎల్ వేలం: అమ్ముడుపోని యువ‌రాజ్ సింగ్‌

- Advertisement -

2019 ఐపీఎల్ సంబంరాలు ఇప్ప‌టి నుంచే మొద‌లైయ్యాయి. 2019 ఐపీఎల్ సంబంధించి ఆట‌గాళ్ల వేలం ఈ రోజు జ‌ర‌గ‌నుంది.ఐపీఎల్‌–12 సీజన్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. 70 మంది ఆట‌గాళ్ల‌ని లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి.ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్‌పాట్‌ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్‌ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

వృద్ధిమాన్‌ సాహా కనీస ధర కోటి రూపాయిలతో అందుబాటులోకి రాగా, అతన్ని రూ. 1కోటి 20 లక్షలకు సన్‌రైజర్స్‌ తీసుకుంది.చతేశ్వర్‌ పూజారా 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే అతడిని కొనుగోలు చేసుందుకే ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -