రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఐడియా సెల్యులార్ తన వినియోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.
ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.396తో రీఛార్జ్ చేసుకుంటే 70జీబీ డేటాను పొందవచ్చు. దీనిని 70 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. డేటాతో పాటు 3,000 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఈ రీఛార్జ్‌తో ఐడియా నెట్‌వర్క్‌తో పాటు, ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.
{loadmodule mod_custom,GA1}
అయితే ఈఆఫర్‌లో రోజులో 300 నిమిషాలు, వారానికి 1,200 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పరిమితి దాటిన కాల్స్‌కు నిమిషానికి 30పైసలు వసూలు చేయనున్నారు. ఇక రోజుకు 1జీబీ డేటాను మాత్రమే ఈ ప్యాక్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}FrgB_vm7tN4{/youtube}