ఇప్పటి వరకు మనం రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు చూశాం. కాని మార్కెట్‌లోకి త్వరలో మరో కొత్త నాణెం రాబోతోంది. ఆర్థికశాఖ త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదళ చేసింది.తొలిసారిగా తీసుకువస్తున్న ఈ 20 రూపాయాల నాణేనికి 12 అంచులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నాణెం బరువు 8.54 గ్రామ్స్ ఉండనుంది. బహుభుజి ఆకారంలో ఉండే రూ. 20 నాణేం.. దాదాపుగా రూ. 10 నాణేన్ని పోలి ఉంటుంది. కానీ గుండ్రంగా ఉండదు. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో రూ. 20 నాణేంను తయారు చేయనున్నారు. వెలుపలి రింగ్‌ను 65శాతం రాగి, 15శాతం జింక్, 20శాతం నికెల్‌తో తయారుచేస్తుండగా.. లోపలి రింగ్‌ను 75శాతం కాపర్, 20శాతం జింక్, 5శాతం నికెల్‌తో రూపొందిస్తున్నారు. నాణెం ఎడమ అంచున ‘భారత్’ అని హిందీలో, కుడి అంచున ‘ఇండియా’ అని ఇంగ్లీష్ లో ఉంటాయి. అశోక చిహ్నం, సత్యమేవ జయతే కూడా నాణెంపై ఉంటాయి.
- Advertisement -
మార్కెట్‌లోకి త్వరలో రూ.20 కాయిన్ ..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -