Wednesday, May 15, 2024
- Advertisement -

త్వ‌ర‌లో లిక్క‌ర్ కింగ్ ఇండియాకు …

- Advertisement -
India asks UK to speed up Vijay Mallya’s extradition process

వేల కోట్ల రూపాయల్ని బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని, బ్యాంకుల్ని నిండా ముంచేసిన ఘనుడు ‘లిక్కర్‌ కింగ్‌’ విజయ్‌ మాల్యా. ‘కింగ్‌ఫిషర్‌’ సామ్రాజ్యానికి మహారాజులా ఓ వెలుగు వెలిగిన మాల్యా, విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ లిక్క‌ర్ దొర‌గారు త్వ‌ర‌లో ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు అధికారులు.

భారీరుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాల్లో భారత విచారణ అధికారులు మరో కీలక అడుగు ముందుకు వేశారు. బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యాను భారత్‌ కు అప్పగించేందుకు బ్రిటన్‌ అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు అత్యున్నత స్థాయి అధికారుల మధ్య జరిగిన సమావేశంలో అంగీకారం కుదిరింది. మాల్యాను ఇండియాకు పంపించేందుకు భారతదేశం , యూకే మధ్య పరస్పర మార్పిడి చట్టాలకు లోబడి పూర్తి సహాయ సహకారాలు అందించేందకు అంగీకరించారు. ఈ మేరకు భారత నిబంధనలకు బ్రిటన్‌ అధికారులు అంగీకరించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య పెండింగ్‌ లో ఉన్న మిగతా కేసుల్లో కూడా పరస్పరం సహకరించుకునేందుక ఇరుదేశాలు అంగీకరిచాయి. ఈ మేరకు జూన్‌లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.
కాగా ఇప్ప‌టికే మాల్యా వ్యవహారంలో ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం లండన్‌ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతోపాటు,ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల చర్చలు జరపుతోంది. ఇటీవల లండన్‌ లో అరెస్ట్‌ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే.
దొర‌గారు వ‌స్తున్నారు స‌రే..వచ్చాక అతన్ని జైలుకి పంపిస్తారా.? దోచేసిన వేల కోట్లను కక్కిస్తారా… లేదంటే, సింపుల్‌గా బెయిల్‌ దక్కించేసుకుంటారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఏమో ఇది ఇండియా క‌దా…డ‌బ్బులుంటే చాలు ఏప‌నైనా జ‌రుగుతుంది. ఓ దొంగకి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టిన ఘనత మన రాజకీయ వ్యవస్థకే చెల్లింది. ఆ దొంగ, దేశం విడిచి పారిపోవడానికీ ఇదే రాజకీయం సహకరించింది. కాబట్టి, విజయ్‌ మాల్యా దొరికినా శిక్ష పడుతుందన్న గ్యారంటీ అయితే లేదు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}0CDc2S2Ct9M{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -